Homeతెలంగాణపంటలు కోతకొచ్చిన రైతుబంధుపై స్పష్టత లేదు : కేటీఆర్

పంటలు కోతకొచ్చిన రైతుబంధుపై స్పష్టత లేదు : కేటీఆర్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా అధికార పార్టీ కాంగ్రెస్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గన్ పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు కోతకు వచ్చిన ప్రభుత్వం మాత్రం ఇంకా రైతుబంధుపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు అని తీవ్రంగా మండిపడ్డారు. గత కెసిఆర్ హయాంలో రైతన్నలు నాట్లు వేసే సమయానికి రైతుబంధు ఇచ్చి ప్రజలకు అండగా నిలబడితే ఈరోజు పంటలు కోతకు వచ్చిన ప్రజలకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం అన్నారు. రైతులకు ప్రతి విషయంలోను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు అని ఎద్దేవా చేశారు. అధికారంలో రావడానికి ఆరు గ్యారంటీలు అని చెప్పి.. ఈరోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని మోసం చేశారు. యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అని ఫైరయ్యారు. కానీ రాహుల్ గాంధీకి 1,000 కోట్లు అంటూ?.. కేటీఆర్ ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

సాగు మరియు తాగునీటి కోసం మునుగోడు లో భారీ ర్యాలీ

కూతురికి వరుడు దొరకడం లేదని తల్లి ఆవేదన

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు