Tuesday, March 17, 2026
Homeతెలంగాణసాగు మరియు తాగునీటి కోసం మునుగోడు లో భారీ ర్యాలీ

సాగు మరియు తాగునీటి కోసం మునుగోడు లో భారీ ర్యాలీ

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- మునుగోడు మండల రైతులకు సాగు మరియు తాగునీటి కోసం మండల కేంద్రంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించి .. కలవలపల్లి మాజీ సర్పంచ్ రైతు గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన రైతాంగ ధర్నా కార్యక్రమంలో మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల రైతులు మాజీ తాజా ప్రజా ప్రతినిధులు సర్పంచులు పార్టీలకతీతంగా పాల్గొని నిరసన తెలిపి తహసిల్దార్ కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వ్యవసాయం మా రైతుల జీవనాధారం అని ప్రస్తుతం గ్రామాల్లో అనేక మంది రైతులు భూగర్భ జలాలపై ఆధారపడి వరి పంటను సాగు చేస్తున్నారని గుర్తుకు తెచ్చారు.. దురదృష్టవశాత్తు మునుగోడు మండలం ఫ్లోరోసిన్ ప్రభావిత ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. అధిక ఫ్లోరైడ్ వల్ల వ్యవసాయానికి మాత్రమే కాకుండా మనుషుల వినియోగానికి కూడా ప్రమాదకరంగా మారిందన్నారు.. వ్యవసాయం మా రైతుల జీవనాధారం అని సరిపడా సాగునీరు లేక ప్రస్తుతం పొలాల్లో ఉన్న వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి నీరు అందించాలని,మునుగోడు మండలములోని చెరువులకు నీరు అందించాలని,మండలంలోని చెరువులు మరియు సాగునీరు వనరులను అనుసంధానం చేసి మా పొలాలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి మునుగోడు మండలానికి నీరు అందించాలని లేనియెడల ముందు ముందు పెద్ద ఎత్తున ఉదయ సముద్రం రైతాంగ వేదిక ద్వారా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో పోలగొని సత్యం, బోలుగురి నరసింహ, సురిగి చలపతి,గురిజ రామచంద్రం,పోలగొని సైదులు గౌడ్,గజ్జల బాలరాజు, సుధాకర్, గోస్కొండ లింగయ్య,బూడిద లింగయ్య యాదవ్,జాజుల అంజయ్య,చిలుముల రాజు చావల శ్రీను,నన్నురి వెంకటరెడ్డి, జిట్టగోని సైదులు, బొల్లు సైదులు, బండారు శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు పార్టీలకు అతీతంగా పాల్గొన్నారు.

హర్రర్ సినిమాలకు కథ అక్కర్లేదంటున్న ఆర్జీవీ

సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీలపై నెటిజన్ల ట్రోలింగ్.. క్లారిటీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments