Homeతెలంగాణపదో తరగతి విద్యార్థులకు ఉచిత పరీక్షా ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్స్‌ల పంపిణీ

పదో తరగతి విద్యార్థులకు ఉచిత పరీక్షా ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్స్‌ల పంపిణీ

మాడ్గుల, క్రైమ్ మిర్రర్:- మాడ్గుల మండలం కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న 43 మంది విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు ,జ్యామెట్రీ బాక్స్‌లను మసున విష్ణు అందజేశారు. కేజీబీవీ ప్రత్యేక అధికారి రేఖ విజ్ఞప్తి మేరకు ఈ సహాయాన్ని అందింజేషమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాడ్గుల గ్రామ ఉప సర్పంచ్ సూదిని శరత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

మండల స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.10,000 ,రెండో ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.5,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తామని ఆయన ప్రకటించారు.విద్యార్థులు అడిగిన వెంటనే సహాయం అందించిన మసున విష్ణు కి ఉప సర్పంచ్ సూదిని శరత్ రెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారి రేఖ ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు లవ కుమార్, కొనాపురం రాజు, కేజీబీవీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి …

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు