Homeఆంధ్ర ప్రదేశ్వేట‌గాళ్ల ఉచ్చులో రెండు ఏనుగులు బ‌లి..!

వేట‌గాళ్ల ఉచ్చులో రెండు ఏనుగులు బ‌లి..!

తిరుపతి,క్రైమ్ మిర్ర‌ర్: వేట‌గాళ్ల వేసిన క‌రెంటు తీగ‌ల‌కు త‌గిలి రెండు ఏనుగులు మృత్యువాత ప‌డ్డ ఘ‌ట‌న తిరుప‌తి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో జిల్లాలో విషాదం అలుముకుంది. జిల్లాలోని ఎర్ర‌వారిపాలెం మండ‌లంలో మేత కోసం పోలాల వైపు వ‌చ్చిన ఏనుగులు వేటగాళ్లు వేసిన క‌రెంటు తీగ‌ల‌కు త‌గిలి మృతి చెందాయి. ఈ విష‌యం సోమ‌వారం ఉద‌యం వెలుగులోకి వ‌చ్చింది. స్థానికుల వెంట‌నే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వేటగాళ్లు ఉద్దేశపూర్వకంగా కరెంట్ ఉచ్చు పెట్టడం వల్లనే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనకు కారణమైన వేటగాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

 

తాజావార్తలు