Homeతెలంగాణమహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి - ఎలికట్టి శ్రావణి

మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి – ఎలికట్టి శ్రావణి

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎలికట్టి శ్రావణి అన్నారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకులుగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

నేటి కాలంలో మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు, వ్యాపారం వంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని తెలిపారు. మహిళలు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు