* తెలుగు రాజకీయాల్లో సరికొత్త జంట
* ఒకరి కష్టాల్లో ఒకరు పాలుపంచుకుంటూ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ: రాజకీయాల్లో ఎదుగుదల వెనుక స్నేహాలు, బంధుత్వాలు పనిచేస్తాయి. అయితే బంధుత్వం కంటే మించి స్నేహం పనిచేస్తుంది. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మద్య స్నేహం ఈనాటిది కాదు. నరేంద్ర మోడీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు అమిత్ షా. ఆ స్నేహం చిగురించి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. అయితే తాజాగా తెలంగాణ రాజకీయాల్లో సైతం ఇటువంటి స్నేహం హాట్ టాపిక్ అవుతోంది. రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమోట్ కావడంతో.. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి తో ఉన్న స్నేహం తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో సైతం చర్చకు దారితీసింది. తెలుగు రాజకీయాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి, కెవిపి రామచంద్ర రావు ద్వయంతో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి జోడిని పోల్చడం ప్రారంభం అయింది.
నాలుగు దశాబ్దాల స్నేహం..
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి కెవిపి రామచంద్రరావు ను ఆత్మగా అభివర్ణిస్తారు. మెడికల్ కాలేజీలో పరిచయమైన వారి స్నేహం నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగింది. అంతలా ఆత్మబంధువుల్లా మారిపోయారు ఆ ఇద్దరు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం సొంత కుటుంబాన్ని ఎంత విషాదం మిగిల్చిందో.. అంతకంటే ఎక్కువగా కెవిపి రామచంద్ర రావుకు మిగిల్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కష్టంలోనూ,, సుఖంలోనూ, రాజకీయ ఇబ్బందుల్లోనూ, ఉన్నత పదవులు సాధించడంలోనూ పాలుపంచుకున్నారు కెవిపి. నిజంగా వారి మధ్య స్నేహం చాలా విలువైనది.
తెర వెనుక వ్యూహం..
2003లో పాదయాత్ర చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతున్న వేల నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంత ధైర్యం చేయడానికి ప్రధాన కారణం కేవీపీ రామచంద్రరావు. తెర వెనుక కెవిపి వ్యూహకర్త అయితే.. దానిని అమలు చేసింది మాత్రం ముమ్మాటికి వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆ మహానేత పాదయాత్ర తెర వెనుక వ్యూహమంతా కేవీపీ ది. ఎన్నికల మేనిఫెస్టో నుంచి టిక్కెట్లు ఇవ్వడం వరకు కెవిపి హవా చాటుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సలహాదారు పాత్రలోకి వచ్చిన కేవీపీని.. రాజ్యసభకు ప్రమోట్ చేసారు రాజశేఖర్ రెడ్డి. అలా 2020 వరకు రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు కెవిపి.
రేవంత్ ఎదుగుదల వెనుక..
అయితే రాజశేఖర్ రెడ్డి – కెవిపి రామచంద్రరావు బంధాన్ని గుర్తు చేస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి- వేం నరేందర్ రెడ్డి. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి ఈ ఇద్దరు ఎంతో స్నేహితులు. కష్టంలోనూ, సుఖంలోనూ పాలుపంచుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని తన సలహాదారుడిగా నియమించుకున్నారు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభకు ప్రమోట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలైన సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ వారందరినీ కాదని తన స్నేహితుడికి రాజ్యసభ ఇప్పించుకొని తన పట్టును కొనసాగించారు. సేమ్ టు సేమ్ రాజశేఖర్ రెడ్డి అన్నట్టు చేసి చూపించారు. మొత్తానికైతే అప్పుడు వైయస్, కేవీపీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి- వేం నరేందర్ రెడ్డి అన్న మాట.
