విజయవాడ, క్రైమ్ మిర్రర్: విజయవాడ విద్యాదారపురం నేషనల్ ప్లే స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. మూడేళ్ల పాప అనిచూడ కుండా టీచర్ దాష్టికంగా ప్రవర్తించింది. గత నెల ఫిబ్రవరి 23న నేషనల్ స్కూల్ వద్ద తల్లి పాపను దింపి ఇంటికి వెళ్లి పోయింది. కాసేపటికి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. పాపా బాత్ జారిపడిందని తెలిపారు. తల్లి వెంటనే స్కూల్‌కు చేరుకొని ఏడుస్తున్న పాపను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు యాసిడ్‌గా గుర్తించి తెలిపారు.
దీంతో తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి వెళ్లి గట్టిగా అడుగగా నిజాన్ని యాజమాన్యం ఒప్పుకుంది. ఆసుపత్రిలో బిల్లులు కట్టి చేతులు దులుపుకుంది. కొంత డబ్బులు ఇచ్చి రాజికి రమ్మని యాజమాన్యం కోరింది దీనికి పాప తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు పాల్పడింది. ఈ విషయాలు బయటకు చెబితే నీ అంతు చూస్తాం డీసీపీ తమ చుట్టం అని ప్రిన్సిపాల్ వార్నింగ్ ఇచ్చారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురిపై ఇంత కిరాతకంగా గాయపరిచిన వారిని శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
