Friday, March 6, 2026
Homeఆంధ్ర ప్రదేశ్శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

శ్రీవారిని దర్శించుకున్న కవిత దంపతులు

  • రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌పై స్వామి వారి ద‌య ఉండాలిః క‌విత‌

తిరుమల, క్రైమ్ మిర్ర‌ర్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కటుంబ స‌మేతంగా ద‌ర్శించ‌కుకున్నారు. శుక్రవారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి స్వామివారిని ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈక సంద‌ర్భంగా కవిత మాట్లాడుతూ నేను నాలుగు సంవత్సరాలుగా పడుతున్న మనో వేదన స్వామి వారి దయతో తీరిపోయింద‌న్నారు. సత్యం, న్యాయం , ధర్మం మావైపు ఉందని నేను చెప్తూ వచ్చాను.

స్వామి వారి దయతో కంప్లీట్ గా క్లీన్ చిట్ వచ్చిందని, అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాని తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నాను. అంతేగాకుండా తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని స్వామివారిని కోరుకున్న‌ట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments