•భూమిని అమ్మీ రిజిస్ట్రేషన్ చేయనంటున్నాడు..
•ఇదేమిటని అడిగితే పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నాడు..
•తమకు న్యాయం చేయాలంటూ బాధితుల ఫిర్యాదు..
క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి:- మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లు 316, 317, 318లలో ఉన్న వ్యవసాయ పొలాన్ని గ్రామానికి చెందిన నాగిల్ల కృష్ణయ్య గత కొన్ని సంవత్సరాల క్రితం 40 గుంటలు( ఒక్క ఎకరా) భూమిని గ్రామానికి చెందిన చిక్కాల రాజు, బన్నె నవీన్, బన్నె ముత్యాలు, బన్నె శ్రీశైలం, బన్నెపర్వతాలు, కానుగుల అయ్యప్ప,శ్రీశైలం లకు విక్రయించి ఇప్పుడు ఇండ్లు నిర్మించేందుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ సోమవారం గ్రామ కార్యదర్శి హరికృష్ణకు,మాడ్గుల పోలీస్ స్టేషన్లో బుధవారం బాధితులు ఫిర్యాదు చేశారు. అన్ని అనుమతులు ఉన్నాయంటూ పర్మిషన్ లేకుండానే తమకు భూమిని విక్రయించాడని తాము ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే గ్రామపంచాయతీ నుండి నోటీసులు ఇప్పించాడని వారు వాపోయారు. అన్ని అనుమతులతో తమకు భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని అడిగితే అక్రమంగా కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురవు చేస్తున్నట్లు చెప్పారు. ఇంతకుముందు అమ్మిన ఇండ్లకు సైతం రైతుబంధు ఆయన పేరు మీదే వస్తుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని వారు అధికారులకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇదే గ్రామంలో మరికొందరు వ్యవసాయ పొలాన్ని గుంటల లెక్కన విక్రయించి అందులో నిర్మాణాలు చేపట్టిన ఇప్పటికీ రైతుబంధు వారి పేరిటే వస్తుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారు యాదయ్య, నాయకులు చింతపల్లి రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఇంతకీ అసలు నిజం ఏంటి?
Political U-Turn: జనసేనకు మాజీ మంత్రి బాలినేని గుడ్ బై, వైసీపీలోకి యూటర్న్!
