Homeక్రీడలుఆమనగల్లు జాతర: క్రీడలను ప్రారంభించిన డిఎస్పి రాజశేఖర్ రాజు

ఆమనగల్లు జాతర: క్రీడలను ప్రారంభించిన డిఎస్పి రాజశేఖర్ రాజు

క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: వేములపల్లి మండల కేంద్రంలోని ఆమనగల్లు గ్రామంలో కాకతీయల కాలం నుండి ప్రసిద్ధి శ్రీ రామలింగేశ్వర జాతర రాష్ట్రస్థాయి కబడ్డీ, కోలాటం క్రీడలను ఆదివారం దేవాలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్ తో కలిసి మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ప్రారంభించారు. అనంతరం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలను ప్రారంభించారు.

అంతకుముందు శ్రీరామలింగేశ్వర దేవాలయంలో అర్చకులు రెంటాల సతీష్ శర్మ,మణిశర్మ ఆధ్వర్యంలో అర్చనలు,అభిషేకాలు దేవాలయ చైర్మన్ తో కలిసి డీఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కబడ్డీ క్రీడలలో పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా డిఎస్పి రాజశేఖర్ రాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. క్రీడలలో పాల్గొనే క్రీడాకారులు ఫ్రెండ్లీ క్రీడలు నిర్వహించుకోవాలని కోరారు.జాతర భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు బాగున్నాయన్నారు. దేవాలయం కోరుకుంటే వరాలిచ్చే దేవాలయంగా నిలిచిందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు పిల్లల సందీప్,ఎలికంటి భరత్,ఎస్సై వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్లు సాలెం రాజు, గంట స్వాతి నరసయ్య,పంచాయతీ కార్యదర్శి షేక్ జానీ, రాష్ట్ర ఐ ఎన్ టి యు సి కార్యదర్శి బంటు చుక్కయ్య గౌడ్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పత్తిపాటి స్వరాజ్యలక్ష్మి, కాంగ్రెస్ మండల నాయకులు రావు ఎల్లారెడ్డి,రవీందర్ రెడ్డి,ధర్మకర్తలు,వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు