Homeతెలంగాణబాలానగర్ పోలీస్ సిబ్బందికి బీమా, పొదుపు మార్గాలపై అవగాహన సదస్సు

బాలానగర్ పోలీస్ సిబ్బందికి బీమా, పొదుపు మార్గాలపై అవగాహన సదస్సు

బాలానగర్,క్రైమ్ మిర్రర్:- నిరంతరం విధుల్లో ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడే పోలీసుల సామాజిక భద్రతే ధ్యేయంగా బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం సీఐ నర్సింహా రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పోలీస్ సిబ్బందికి పర్సనల్ లైఫ్, యాక్సిడెంటల్, మెడికల్ ఇన్సూరెన్స్‌తో పాటు పొదుపు మార్గాలపై ఆర్థిక సలహాదారు రమేష్ బోయ్య సమగ్ర అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రమేష్ బోయ్య, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమా పోషించే కీలక పాత్రను వివరించారు. కుటుంబ బాధ్యతలు, ఆదాయం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సరైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో సిబ్బందికి వివరించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ లభించే టర్మ్ ప్లాన్ల గురించి, క్లెయిమ్ ప్రక్రియలు, పన్ను ప్రయోజనాల (Tax Benefits) గురించి ప్రత్యేకంగా చర్చించారు. అనంతరం సీఐ నర్సింహా రాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలు లేదా అనారోగ్య సమస్యల సమయంలో బీమా పాలసీలు కుటుంబానికి కొండంత అండగా నిలుస్తాయని సీఐ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వినోద్ కుమార్, ఏఎస్‌ఐ హనుమయ్య, కానిస్టేబుళ్లు, ఇతర పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ సందేహాలను నిపుణులతో చర్చించి నివృత్తి చేసుకున్నారు.

రోజుకు 6 గంటల నిద్ర ప్రమాదమా?

Bolivia: సైనిక విమానం కూలి స్పాట్‌లోనే 15 మంది మృతి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు