Thursday, February 26, 2026
Homeక్రీడలుజట్టు కష్టాల్లో ఉంటే నాకు ఆనందం : జితేష్ శర్మ

జట్టు కష్టాల్లో ఉంటే నాకు ఆనందం : జితేష్ శర్మ

  • క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా యంగ్ క్రికెటర్ జితేష్ శర్మ తాజాగా భారత జట్టు గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆడడానికి ట్రై చేస్తుంటాను అని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భారత జట్టు బ్యాటర్,వికెట్ కీపర్ జితేష్ శర్మ మన జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలి పోవాలి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు నా జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలాలి అని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. అలా కోరుకోవడానికి కూడా వివిధ కారణాలు ఉన్నాయి అని శర్మ తెలిపారు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నాకు బ్యాటింగ్ అవకాశం వస్తే అప్పుడు హీరో అవ్వచ్చు అని తెలిపారు.

టాపార్డర్ పూర్తిగా విఫలమవుతే ఆ తర్వాత నాకు బ్యాటింగ్ వస్తుంది అని.. అందులో మంచిగా ప్రదర్శన చేస్తే ఆ మ్యాచ్ కు నేను హీరో అయ్యే అవకాశం ఉంటుంది అని తెలిపారు. కాబట్టి అలాంటి సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టమని జితేష్ శర్మ పేర్కొన్నారు. జట్టును ఆదుకోవడమే కాకుండా నా కెరీర్ పరంగా కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి మ్యాజిక్ ఇన్నింగ్స్ ఆడాలని ప్రతిరోజు కోరుకుంటాను అని ఆ ఇంటర్వ్యూలో తన మనసులోని కోరికలను తెలియజేశారు. అయితే ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు పది రకాలుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. నువ్వు ఎదగదలుచుకోవడం మంచి నిర్ణయమే కానీ ఇతరులు నాశనం అయిపోవాలి అనే భావన మానుకోవాలి అని జితేష్ శర్మకు సూచనలు చేస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments