సత్య సాయి బాబా వాటర్ ప్రాజెక్టును యధావిధిగా కొనసాగించండి.
596 మంది కార్మికులకు న్యాయం చేయాలి
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి, క్రైమ్ మిర్రర్: కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రజలకు శ్రీ సత్యసాయిబాబా తాగునీరు తీసుకొచ్చిన ప్రత్యక్ష కలియుగ దైవమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతంలో నీటి దాహర్తిని తీర్చడానికి సత్యసాయి వాటర్ ప్రాజెక్టును ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి 1997లో ప్రారంభించారన్నారని తెలిపారు.
విజయవాడ అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సత్యసాయి త్రాగునీటి పథకం లో ఎదురవుతున్న ఇబ్బందులను, కార్మికుల సమస్యలను ఆమె అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ ప్రాజెక్టు కింద 273 వ్యక్తిగత ప్రాజెక్టులు 19 ఇతర స్కీములు మరో 5 మిగతా స్కీమ్ లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో 1341 గ్రామాలకు 16.41 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందిస్తోందన్నారు. అయితే ఈ సత్యసాయి ప్రాజెక్టును ఈ మధ్య జిల్లా పరిషత్ బోర్డు కు అప్పగించడం జరిగిందన్నారు.
దీనివల్ల ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా జరిగే అవకాశం తక్కువగా ఉందని ప్రజల్లో ఆందోళన కలుగుతుందన్నారు. జిల్లా పరిషత్ కింద ఈ ప్రాజెక్టు ఉంటే నిర్వహించడం కూడా ఎంతో కష్టమన్నారు. మరి ముఖ్యంగా ఈ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు అనేది భగవాన్ శ్రీ సత్య సాయి బాబా డ్రీమ్ ప్రాజెక్టు అన్నారు.
ప్రభుత్వం తక్షణం సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టును జిల్లా పరిషత్ నుంచి తొలగించి తిరిగి సత్యసాయి త్రాగినీటి పథకంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పథకంలో పని చేస్తున్న 596 మంది కార్మికులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ఆమె ప్రత్యేకంగా కోరారు.

