Thursday, February 26, 2026
Homeఆంధ్ర ప్రదేశ్రాజంపేట లాడ్జిలో ఘోర అగ్ని ప్రమాదం

రాజంపేట లాడ్జిలో ఘోర అగ్ని ప్రమాదం

  • ఒకరు సజీవ దహనం

కడప ,క్రైమ్ మిర్ర‌ర్‌: రాజంపేట పట్టణం రైల్వే స్టేషన్ రోడ్ లోని దీప్ లాడ్జిలో అర్థ‌రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభ‌వించి. విద్యుత్ షాక్ సర్క్యూట్ తో ద‌ట్ట‌మైన‌పొగ‌ మంటలు వ్యాపించాయి. లాడ్జిలో ఉన్న 39 మంది భయాందోళనలతో పరుగులు తీసారు.

దట్టంగా అలుముకున్న పొగకు మొదటి ఫ్లోర్ నుంచి కిటికీల ద్వారా పలువురు కిందకు దూకారు. రాక పోకలకు ఒకే దారి ఉండడంతో తొక్కిస లాట జరిగింది. అగ్నిమాపక సిబ్బంది బాధితులను నిచ్చినల ద్వారా కిందకి దింపారు. కాగా ప్రమాదంలో ఒక వ్యక్తి మంటలకు సజీవదహనమ‌య్యాడు.

మృతుడు శ్రీనివాసులు (35) రాజంపేట సూపర్ కే మార్ట్ ఉద్యోగిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ పి మనోజ్ కుమార్ హెగ్డే, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్న‌ట్లు వెల్లడించారు. కాగా ఆస్వస్థతకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments