Homeజాతీయంఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

  • పేద ప్ర‌జ‌ల అప‌ద్బాంధ‌వుడు
  • రైతు ప‌క్ష‌పాతి రైతుబాంధ‌వుడు కేసీఆర్‌

గోదావరిఖని, క్రైమ్ మిర్ర‌ర్: రైతు బంధుతో రైతుల‌కు, దేశానికి దారి చూపిన మ‌హానేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుజ‌న్మ‌దిన వేడుకుల‌ను మంగ‌ళ‌వారం రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల్ల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘ‌నంగా నిర్వ‌హించారు.

అనంత‌రం ఆయన ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.తెలంగాణ స్వరాష్ట్ర సంకల్పమే దీక్షగా స్వాభిమానాన్ని శ్వాసగా మార్చిన ఉద్యమ మహానేత అని కొనియాడారు.పేదల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయం దండగ అన్న వారి కళ్లు తెరిపించి రైతుబంధు పేరుతో దేశానికే దశాదిశా చూపిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో టీబీజీక్స్ నాయకులు మాదాసి రామ్మూర్తి వడ్డేపల్లి శంకర్ బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహీద్ పాషా, మాజీ కో ఆప్షన్ తస్లీమ్ భాను, మాజీ కార్పొరేటర్లు బొబ్బిలి సతీష్, ఐత శివకుమార్, బక్కి కిషన్, బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ, కొండా సురేష్, పోయిల రవి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేకల రామస్వామి, మెరుగు చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

Most Popular

Recent Comments