Homeతెలంగాణబెల్లంపల్లిలో బీఆర్ఎస్ మరింత బలం

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ మరింత బలం

  • పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు!

బెల్లంపల్లి, క్రైమ్ మిర్ర‌ర్: బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు శనివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి కూడా కేటీఆర్ను కలిశారు. ఆయన ప్రస్తుతానికి పార్టీలో అధికారికంగా చేరనప్పటికీ, బీఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై పార్టీకి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ చేరికల వల్ల బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మరింత బలోపేతం కానున్నది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు