Homeక్రైమ్పురుగుల అన్నం తిని విద్యార్థుల అస్వ‌స్థ‌త‌

పురుగుల అన్నం తిని విద్యార్థుల అస్వ‌స్థ‌త‌

  • ఒక్క మెతుక‌న్నం కూడ‌ప‌డేయ‌వ‌ద్ద‌ని వార్డెన్ క‌ర్క‌శ‌త్వం
  • 108కి కాల్ చేయ‌మ‌న్న ప‌ట్టించుకోని వైనం
  • ఆర్ఎంపీతో వైద్యం

బెల్లంప‌ల్లి,క్రైం మిర్ర‌ర్ః

పురుగుల అన్నం తిని 40 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజ‌న్ తో అస్వ‌స్థ‌కు గురైన ఘ‌ట‌న బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణం ప్ర‌భుత్వ ఎస్సీ బాలిక‌ల హాస్ట‌ల్లో చోటు చేసుకుంది.

అన్నంలో పురుగులు వ‌చ్చాయ‌ని తెలిపిన ఒక్క మెతుకు కూడ ప‌డేయ‌వ‌ద్ద‌ని తినాల‌ని వార్డెన్ క‌ర్క‌శ‌త్వంగా ప్ర‌వ‌ర్తించారు.

విద్యార్థులు అన్నం తిన్న వెంట‌నే క‌ళ్లు తిరిగి పోవ‌డం, వాంతులు వ‌చ్చి అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలి పోయారు. ఈ విష‌యంపై 108కి కాల్ చేస్తామ‌ని వేడుకున్న ప‌ట్టంచుకోకుండా సిబ్బంది చూస్తు కూర్చున్నారు.

ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే ప‌రువు పోతుంద‌ని గ‌మ‌నించి స్థానికంగా ఉండే ఓ ఆర్ఎంపీతో ఇంజ‌క్ష‌న్, టాబ్లెట్స్ ఇప్పించారు.

సాయంత్రం 7.30 గంట‌ల‌కు అస్వ‌స్థ‌కు గురైన‌ట్లు తెలుప‌గా రాత్రి 10 గంట‌ల‌కు హాస్ట‌ల్ వ‌ద్ద‌కు వెళ్లారు. మూడు గంట‌లు న‌ర‌కం అనుభ‌వించామ‌ని విద్యార్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు