Homeక్రైమ్ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.

ఉపాధ్యాయుడి కామచేష్టలు.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు.

​చింతపల్లి (క్రైమ్ మిర్రర్):- అక్షరాలు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన, ఓ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి, గురుశిష్యుల బంధానికి కళంకం తెచ్చాడు.

ఈ ఘటన మాల్ గోడుకొండ్ల, విటి నగర్ ప్రైమరీ స్కూల్‌లో కలకలం రేపింది. మాల్ గోడుకొండ్ల విటి నగర్ ప్రాథమిక పాఠశాలలో, 4వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల, సదరు ఉపాధ్యాయుడు గత కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.

తాజాగా, సదరు ఉపాధ్యాయుడి ప్రవర్తన, హద్దులు దాటడంతో విషయం బయటకు పొక్కింది. ​బాధిత విద్యార్థిని ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. పాఠశాలకు చేరుకున్న గ్రామస్తులు సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు.

అతడి సమాధానంతో సంతృప్తి చెందని జనం, అక్కడికక్కడే అతడికి దేహశుద్ధి చేశారు.​ విద్య నేర్పే దేవాలయం వంటి పాఠశాలలో, ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు