Homeఆంధ్ర ప్రదేశ్ఇంత నీచమైన రాజకీయాలు చూడలేదు.. డిప్యూటీ సీఎంకు ఇదే నా ప్రశ్న : అంబటి...

ఇంత నీచమైన రాజకీయాలు చూడలేదు.. డిప్యూటీ సీఎంకు ఇదే నా ప్రశ్న : అంబటి కూతురు

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన ఘటన తరువాత వైసీపీ నాయకులు అందరూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అధికార కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంబటి రాంబాబు కూతురు మౌనిక మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నా జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడు చూడలేదు అని.. మా ఇంటి పై దాడి చేస్తున్న సమయంలో పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర పోషించారు అని అంబటి రాంబాబు కూతురు మౌనిక సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడులను హోం మంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థిస్తారా అని ప్రశ్నించారు.

Read also : లోకేష్ నన్ను చంపేయాలని చూస్తున్నారు.. జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు?

గతంలో జగన్ పై కూడా చంద్రబాబు నాయుడు అనేకసార్లు అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు మా నాన్న అన్నది చంద్రబాబు నాయుడుని కాదు అని చెప్పినా కూడా ఈ దాడులు జరిగాయి అని అన్నారు. అలా మాట్లాడినందుకుగాను ఇప్పటికే మా నాన్న క్షమాపణలు కూడా చెప్పారు అని గుర్తు చేశారు. దాదాపు 8 గంటలపాటు మాపై దాడులు చేస్తూనే ఉన్నారు అని.. మహిళల క్షేమం గురించి నిరంతరం మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. ఇప్పటికీ తమ ఫిర్యాదులను పోలీసులు తీసుకోవడం లేదు అని.. మాపై దాడి చేసిన టీడీపీ గుండాలను కంట్రోల్ చేస్తున్నట్లు పోలీసులు యాక్షన్ చేస్తున్నారు అని తీవ్రంగా ఆరోపించారు. ఏది ఏమైనా కూడా గత రెండు మూడు రోజుల నుంచి ఈ దాడుల విషయం రాజకీయ దుమారం రేపుతోంది. మరోవైపు ఇప్పటికే హైకోర్టు సైతం అంబటి రాంబాబు కుటుంబానికి శాంతి భద్రతలు అదుపులోకి వచ్చేంత వరకు కూడా భద్రత కల్పించాలి అని పోలీసులను ఆదేశించింది.

Read also : Trump Praises India Gate: ఇండియా గేట్‌ బాగుంటుంది..అమెరికాలో కట్టేస్తాం: ట్రంప్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు