Homeఅంతర్జాతీయంTrump Praises India Gate: ఇండియా గేట్‌ బాగుంటుంది..అమెరికాలో కట్టేస్తాం: ట్రంప్

Trump Praises India Gate: ఇండియా గేట్‌ బాగుంటుంది..అమెరికాలో కట్టేస్తాం: ట్రంప్

Trump On India Gate: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీలోని ఇండియా గేట్ పై మనసు పడ్డారు. ఈ కట్టడం అద్భుతంగా ఉందన్నారు. తమ దేశంలోనూ ఇలాంటి నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఇండియా గేట్ ఫోటోను షేర్ చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆయన ఈ పోస్టు పెట్టారు.

సోషల్ మీడియాలో ఇండియా గేట్ ఫోటో షేర్ చేసిన ట్రంప్

భారతీయ సైనిక అమరులకు గుర్తుగా ఢిల్లీలో ఠీవిగా నిలబడిన  ఇండియా గేట్‌ తనకు బాగా నచ్చిందన్నారు ట్రంప్‌. అలాంటిది తమకూ కావాలని అనిపిస్తుందన్నారు. ట్రంప్‌ స్వయంగా దీనిపై ట్రూత్‌ సోషల్‌లో ఇండియా గేట్‌ ఫొటోతో పోస్టు పెట్టారు. ‘‘ఇది భారత్‌ విజయ ద్వారం. మేం కట్టబోయేది ఇలాంటి వాటన్నింటికన్నా గొప్పగా ఉంటుంది’’ అని రాసుకొచ్చారు.

అమెరికాలో విజయ ద్వారం లేదు!

అనంతరం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్..  ప్రపంచంలో చాలా నగరాలకు విజయ ద్వారాలు ఉన్నాయని.. గొప్ప దేశమైన అమెరికాలోని వాషింగ్టన్‌లో మాత్రం లేదని పేర్కొన్నారు. పారిస్ లోని ‘ఆర్క్‌ డె ట్రయంఫీ’ తరహాలో ప్రపంచంలోనే గొప్పగా, అందంగా వాషింగ్టన్‌లో విజయ ద్వారాన్ని నిర్మిస్తామని చెప్పారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు