Homeతెలంగాణకేసీఆర్ వ్యక్తి కాదు.. అతనొక తెలంగాణ చరిత్ర : కేటీఆర్

కేసీఆర్ వ్యక్తి కాదు.. అతనొక తెలంగాణ చరిత్ర : కేటీఆర్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- కేసీఆర్ సిట్ విచారణ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా వైరల్ గా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై తాను ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అని సిట్ విచారణలో భాగంగా కెసిఆర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు కేసీఆర్ తనయుడు,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. తన తండ్రి కెసిఆర్ ను సిట్ అధికారులు విచారించడం పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కెసిఆర్ ఒక వ్యక్తి కాదు అని అతనొక తెలంగాణ చరిత్ర అని కొనియాడారు. ఢిల్లీ ఒత్తిళ్లకే తలవంచని కెసిఆర్ ఈరోజు చిల్లర రాజకీయాలకు భయపడతారా?.. అని ప్రశ్నించారు. ఎటువంటి మూర్ఖులైన సరే చరిత్రను సృష్టించలేరు అని.. అది అర్థం చేసుకోవడానికే సమయం పడుతుంది అని అన్నారు. కెసిఆర్ పేరు చెబితేనే మీకు గుండెల్లో వణుకు పుడుతుంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా ధ్వజమెత్తారు. మీరు ఏం చేసినా ఎన్ని కుట్రలు పన్నిన కేసీఆర్ కీర్తిని మాత్రం చెరిపేయలేరు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Read also : పాకిస్తాన్ ను చిత్తు చేసి సెమీస్ లోకి అడుగుపెట్టిన భారత అండర్-19 జట్టు

Read also : Ayodhya Ram Mandir: మార్చి 19న అయోధ్యకు రాష్ట్రపతి, ఏప్రిల్ 30 నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తి!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు