Thursday, March 19, 2026
Homeతెలంగాణరాంబాబుకు సినిమా చూపిస్తాం : పెమ్మసాని చంద్రశేఖర్

రాంబాబుకు సినిమా చూపిస్తాం : పెమ్మసాని చంద్రశేఖర్

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నిన్నటిరోజునా వైసీపీ నేత,మాజీ మంత్రి అంబటి రాంబాబు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో కూటమి నాయకులు మరియు రాష్ట్రవ్యాప్తంగా కూటమి కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే అంబటి రాంబాబు ఇల్లు మరియు కార్లను కూటమి కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుకు సినిమా చూపిస్తాము అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబును ఇప్పటివరకు కూడా ఎంతో సహనంతో భరించాము అంటూ ఇకనుంచి తామెంటో ప్రతి ఒక్కరికి చూపిస్తాము అని కీలక హెచ్చరికలు చేశారు. కేవలం 24 గంటల్లోనే తమ రియాక్షన్ ఎలా ఉంటుందో అంబటి రాంబాబుతో సహా ఇతర నాయకులకు కూడా తెలుస్తుంది అని అన్నారు. ఇకపై రాష్ట్రంలో బరితెగించి మాట్లాడే వ్యక్తులు భయపడేలా ట్రీట్మెంట్ ఉంటుంది అని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. చట్టబద్ధంగా వెళ్తే ఎటువంటి విధంగా జరుగుతుందో అనేది ప్రతి ఒక్కటి కూడా అంబటి రాంబాబుకు తెలుసు అన్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు అంబటి రాంబాబు పై ఫుల్ ఫైర్ లో ఉన్నారు. నిన్న రాత్రి అంబటి రాంబాబును అరెస్ట్ కూడా చేసారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను కాల్చివేస్తూ నిరసనలు కూడా తెలుపుతున్నారు. వెంటనే అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు నాయుడుకి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు.

Read also : బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నే ఎందుకు ప్రవేశపెడతారో తెలుసా?

Read also : ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే మీ చేతికి రూ.72 లక్షలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments