Homeక్రైమ్Bus Accident: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ, 20 మంది సజీవ దహనం

Bus Accident: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న లారీ, 20 మంది సజీవ దహనం

Bus Accident In Karnataka:  పండుగ పూట ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును లారీ ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ప్రమాదంలో 20 మంది సజీవదహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. చిత్రదుర్గ వద్ద హిరియూర్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో లారీ, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం

ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు బస్సును పూర్తిగా కమ్మేశాయి. బస్సు నుంచి బయటపడే వీలు లేకపోవడంతో 20 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నట్లు సమాచారం. పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments