Homeతెలంగాణ*ప్రజాసేవే నా ప్రధాన ధ్యేయంగా పని చేస్తా - దామెర్ల అశోక్*

*ప్రజాసేవే నా ప్రధాన ధ్యేయంగా పని చేస్తా – దామెర్ల అశోక్*

*క్రైమ్ మిర్రర్, మాడుగులపల్లి ప్రతినిది:* నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలం పరిదిలోని అన్ని గ్రామాల్లో నూతనంగా గెలుపొందిన సర్పంచుల, ఉప సర్పంచుల,  వార్డు మెంబర్లు సోమవారం  ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి.ఈ సందర్బంగా పాములపహాడ్ గ్రామా పంచాయతి 02వ వార్డు మెంబర్  దామెర్ల అశోక్ ప్రమాణ స్వీకార అనంతరం క్రైమ్ మిర్రర్ ప్రతినిది తో మాట్లాడారు..
నా ప్రియమైన పాములపహాడ్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. పాములపహాడ్ గ్రామం 02వ వార్డు ప్రజల ఆశీర్వాదాలతో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఈ శుభసమయంలో, నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం – 2018 ఆత్మకు అనుగుణంగా ప్రజాసేవే నా ప్రధాన ధ్యేయంగా పని చేస్తాను. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా 02వ వార్డు ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావిస్తూ, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలుపై నిరంతరం కృషి చేస్తాను అన్నారు.
గ్రామ సర్పంచ్ కునుకుంట్ల అంజయ్య యాదవ్  నాయకత్వంలో, గ్రామపంచాయతీతో సమన్వయంగా పనిచేస్తూ, పాములపహాడ్ గ్రామ అభివృద్ధికి నా వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను. మీ అందరి సహకారం నాకు బలంగా నిలుస్తుంది ధన్యవాదాలు అని అన్నారు.
Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు