Monday, March 2, 2026
Homeతెలంగాణప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర!

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విహారయాత్ర!

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ :-
విద్యార్థుల విహారయాత్ర అనేది తరగతి గదికి బయట, నిజ జీవిత అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి విద్యార్థులను తీసుకెళ్లే ఒక విద్యా పర్యటన. ఇందులో భాగంగా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విహారయాత్రలో భాగంగా శనివారం మేడిగడ్డ బ్యారేజ్ పరిసర ప్రాంతానికి పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపిఎస్ ప్రధానోపాధ్యాయులు మేకల ఎర్రయ్య మాట్లాడుతూ విద్యార్థులకు విజ్ఞాన విహార యాత్రల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్, నాగరాజు, త్రివేణి, రమ్యశ్రీ లు పాల్గొన్నారు.

Read also : Karnataka Politics: కలిసి టిఫిన్ చేశారు ఓకే, ఇకపై కలిసే ఉంటారా?

Read also : ఐ బొమ్మ రవి మామూలు ఇంటెలిజెంట్ కాదుగా.. పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments