Thursday, February 26, 2026
HomeజాతీయంCar Number: కారు నెంబర్ కోసం అంత ధరా? అవి పైసాలా.. పెంకాసులారా అయ్యా!

Car Number: కారు నెంబర్ కోసం అంత ధరా? అవి పైసాలా.. పెంకాసులారా అయ్యా!

Car Registration Number: చాలా మంది తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు కావాలని కోరుకుంటారు. అయితే, ఈ ధర ఒక్కోసారి లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు చేరుతుంది. పోటీలో పాల్గొనేవారు ఒకరికి మించి మరొకరు ఎక్కుడ డబ్బులు వెచ్చించేందుకు వెనుకాడరు. ఆ నెంబర్ మీద ఎవరైతే ఎక్కువ మొత్తం బిడ్డింగ్ వేస్తారో వారికే దాన్ని కేటాయిస్తారు. అందులో భాగంగానే ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయలకుపైగా ఖర్చు చేశాడు. HR88B8888 నెంబర్ ప్లేట్ కోసం 1.17 కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఈ సంఘటన హర్యానాలో జరిగింది.

నెంబర్ ప్లేట్ కోసం రూ. 1.7 కోట్లు

హర్యానా ప్రభుత్వం వీఐపీ, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా ప్రతీవారం వేలంపాటలు నిర్వహిస్తూ ఉంది. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఈ వేలంపాట సాగుతుంది. ప్రతీ బుధవారం సాయంత్రం 5 గంటలకు వేలం పాట ఫలితాలు వస్తాయి.  తాజాగా జరిగిన వేలంపాట ఫలితాలు వచ్చాయి. ఓ వ్యక్తి HR88B8888 అనే నెంబర్ మీద బిడ్డింగ్ వేశాడు. ఆ నెంబర్ కోసం ఏకంగా 1.17 కోట్ల రూపాయలు వెచ్చించాడు. అతడి దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రాలేకపోయారు. ఆ నెంబర్ అతడి సొంతం అయింది.

ఫ్యాన్సీ నెంబర్స్ కోసం భారీగా ఖర్చు

ప్రభుత్వం ఆ నెంబర్ ప్లేట్ బేస్ బిడ్డింగ్ ధరను 50 వేల రూపాయలుగా నిర్ణయించింది. వేలంపాటలో నెంబర్ ప్లేట్ ధర 1.17 కోట్లకు చేరుకుంది. గత వారం HR22W2222 నెంబర్ ప్లేటును ఓ వ్యక్తి 37.91 లక్షలు పెట్టి కొన్నాడు. నెంబర్ ప్లేట్ల కోసం లక్షలు, కోట్లు ఖర్చు చేస్తున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా బాగా పెరిగిపోయాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి గత సంవత్సరం KL 07 DG 0007 నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా 46 లక్షలు ఖర్చు చేశాడు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments