Homeతెలంగాణజూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి నకిరేకల్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 11, 2025న జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ తరపున నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హైదరాబాద్‌ బంజారా హిల్స్‌లో ఇందిర నగర్ లోని 94వ బూత్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

Also Read:తెలంగాణలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చెయ్యి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల గురించి ప్రజలకు తెలియజేశారు.

ఈ ప్రచారంలో ఆయనతో పాటు TPCC మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, నాయకులు గంగుల రాజిరెడ్డి, గోదాసు పృధ్విరాజ్, పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు