Tuesday, March 10, 2026
Homeజాతీయం6 ఏండ్ల తర్వాత కైలాష్ మానస సరోవర యాత్ర!

6 ఏండ్ల తర్వాత కైలాష్ మానస సరోవర యాత్ర!

Mansarovar Yatra-2025: కోవిడ్-19 సమయం నుంచి ఆగిపోయిన మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కాబోతోంది. సుమారు 6 సంవత్సరాల తర్వాత ఈ యాత్ర జరగనుంది. చైనా కింగ్‌ డావోలో భారత్- చైనా రక్షణ మంత్రుల మధ్య  కీలక అంశాలపై చర్చలు జరిగాయి. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్..  చైనా కౌంటర్ అడ్మిరల్ డాంగ్ జున్‌ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో కొవిడ్ టైమ్ నుంచి ఆగిపోయిన మానస సరోవర యాత్ర గురించి రాజ్ నాథ్ ప్రస్తావించారు. ఈ యాత్రంపై చైనా పాజిటివ్ గా స్పందించింది. ఈ యాత్రకు చైనా సహకారం ఉంటుందని జున్ తెలిపినట్లు రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేధికగా తెలిపారు. ప్రస్తుతం అనుసరిస్తున్న సానూకూల విధానాలనే కొనసాగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. కలిసి పని చేస్తూ కొత్త సమస్యలు రాకుండా నివారించాలని తీర్మానించాయి. ఈ క్రమంలోనే ఆగిపోయిన కైలష్ మానస సరోవర యాత్ర పునఃప్రారంభంపై భారత్ చేసిన చర్చలు సఫలం అయ్యాయి.

మధుబని పెయింట్ బహుకరణ

అటు షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్ కు ట్రీ ఆఫ్ లైఫ్ అనే సాంప్రదాయ మధుబని పెయింటింగ్‌ బహుకరించారు. బీహార్‌ లోని మిథిలా ప్రాంతానికి చెందిన ఈ కళ అత్యంత పురాతనమైనది. సాంస్కృతికత, జ్ఞానం, శక్తికి ఈ పెయింటింగ్ నిదర్శనం. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక, జ్ఞానం, శక్తి సహకారం కొనసాగాలనే ఉద్దేశంతో ఈ బహుమానం అందించారు. మరోవైపు షాంఘై సహకార సంస్థ సంయుక్త ప్రకటనకు భారత్ నిరాకరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఈ ప్రకటనలో ప్రస్తావించకపోవడం, సీమాంతర ఉగ్రవాదంపై ఇండియా కఠిన వైఖరిని గుర్తు చేయకపోవడంతో భారత్ వ్యతిరేకించింది.

Read Also: ఐఎస్ఎస్ లోకి శుభాన్షు, తొలి భారతీయుడిగా రికార్డు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments