Saturday, March 28, 2026
Homeఅంతర్జాతీయంఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ.. ఖతార్ పెద్దన్న పాత్ర!

ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ.. ఖతార్ పెద్దన్న పాత్ర!

Iran- Israel Ceasefire: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల పాటు కొనసాగిన యుద్ధానికి ముగింపు పలకడం వెనుక అమెరికా ఉన్నట్లు అందరూ భావిస్తున్నా, అందులో వాస్తవం లేదు. నిజానికి కాల్పుల విరమణ ఒప్పందంలో కీలక పాత్ర పోషించింది ఖతార్. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నం చేసినా కుదరలేదు. ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఇజ్రాయెల్ ఓకే చెప్పినా, ఇరాన్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ కోరిక మేరకు ఖతార్ రంగంలోకి దిగింది. ఇరాన్ ను కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించింది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు తగ్గడంలో కీలక పాత్ర పోషించింది. ఇంకా చెప్పాలంటే ఖతార్ కారణంగానే ఈ యుద్ధం ముగిసిందని చెప్పుకోవచ్చు. 30 లక్షల జనాభా లేని ఖతార్.. ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రమే కాదు, పలు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి, యుద్ధాలకు ఫుల్ స్టాప్ పెట్టించింది.

గల్ఫ్ నుంచి ఆఫ్రికా వరకు వివాదాల పరిష్కారం

అంతర్జాతీయ సమస్యలను, సంఘర్షణలను పరిష్కరించడం ఖతార్ కు కొత్తేమీ కాదు. గల్ఫ్ నుంచి ఆఫ్రికా దాకా నెలకొన్ని అనేక యుద్ధాలను ఆపించడంలో కీలక పాత్ర పోషించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ మధ్యవర్తిగా ఖతార్‌ కీలక పాత్ర పోషించింది. 2023లో ఖతార్‌ మధ్యవర్తిత్వం కారణంగానే ఇరు దేశాలకు చెందిన 15 మంది చొప్పున పిల్లలు వాళ్ల తల్లిదండ్రుల దగ్గరికి చేరుకున్నారు. 2023 అక్టోబర్‌ లో ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో హమాస్‌ ఉగ్రవాదులు కనీసం 250 మందిని బందీలుగా తీసుకున్నారు. హమాస్‌ చెర నుంచి ఖైదీలను విడిపించడంలో ఖతార్‌ కీలక పాత్రర పోషించింది. 2008లో లెబనాన్‌ లో అంతర్యుద్ధాన్ని ముగించడంలో ఖతార్‌ కీ రోల్ పోషించింది. 2011, 2020లో సూడాన్‌ లో  సంక్షోభానికి తెరపడటంలోనూ మధ్యవర్తిత్వం వహించింది.

ఖతార్ మాట అంటే చాలా గౌరవం

ఖతార్ చిన్న దేశం అయినా, ఆర్ధికంగా బలంగా ఉంది. పలు దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు సాయం అందిస్తుంది. పలు దేశాధినేతలతో పాటు హమాస్, హెజొ్బల్లా లాంటి సంస్థలతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా దేశాలు, సంస్థలు ఖతార్ మాటకు గౌరవం ఇస్తాయి.

Read Also: ఇరాన్ అణు స్థావరాలపై దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments