Saturday, March 28, 2026
Homeఆంధ్ర ప్రదేశ్వైఎస్‌ జగన్‌పై వరుస కేసులు - కూటమి ఆత్మరక్షణలో పడిందా...?

వైఎస్‌ జగన్‌పై వరుస కేసులు – కూటమి ఆత్మరక్షణలో పడిందా…?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైఎస్‌ జగన్‌పై వరుస కేసులు నమోదవుతున్నాయి…? వైసీపీ పనైపోయిందని కూటమి పార్టీలు హెచ్చరిస్తున్నాయి. అయితే.. అది నిజం కాదని.. కూటమి ఆత్మరక్షణలో పడిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాధరణ చూసి భయంతో వరుస జగన్‌పై కేసులు పెడుతోందని అంటున్నారు. కేసులకు భయపడేది లేదని.. మరింత బలంగా ప్రజల్లో వెళ్తామంటున్నారు ఆ పార్టీ నేతలు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత.. వైఎస్‌ జగన్ మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. జగన్‌ కనిపిస్తే చాలు.. జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆయన్ను చూసేందుకు… పోటీపడుతున్నారు. వైఎస్‌ జగన్‌ సినిమా స్టార్‌ కాదు… చంద్రబాబులా… ఎన్నో ఏళ్లు అనుభవం ఉన్న నాయకుడు కాదు. కానీ.. ఆయనకున్న ప్రజాదరణ రాష్ట్రంలో మరెవ్వరికీ లేదన్నట్టుగా జగన్‌ పర్యటనలకు జనం పోటెత్తుతున్నారు. ఆ జనాన్ని చూసి ప్రత్యర్థి పార్టీల గుండెల్లో వణుకు పుట్టడం సహజమే కాదు. అంతేకాదు… ఇలాగే కొనసాగితే వైసీపీ మళ్లీ ఉవ్వెత్తున ఎగిసిపడుతుందన్న భయమూ మామూలే. ఆ ఆలోచన కూటమిలో వచ్చిందంటే… ఆ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డట్టే. అందుకే… జగన్‌ నియంత్రించే చర్యలు చేపట్టినట్టు సమాచారం. జగన్‌ పల్నాడు జిల్లాలో వైఎస్‌ జగన్‌ వెళ్తున్న కారు కింద పడి ఒక వ్యక్తి మరణించాడు. ఈ కేసులో జగన్‌ను ఏ-2 నిందితుడిగా చేర్చారు పోలీసులు. అంతేకాదు… గత పర్యటనల్లో జరిగిన తప్పులను బూతద్దం పెట్టి వెతుకుతున్నారు. అందులో భాగంగా.. గుంటూరు మిర్చి యార్డ్‌ పర్యటనపై కూడా కేసు పెట్టారు. గత రెండు రెండు రోజుల్లో జగన్‌పై రెండు కేసులు పెట్టారు.

కూటమి సర్కార్‌ తనపై వరుస నమోదు చేస్తుడంతో వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు పక్కా ప్రణాళిక కూడా రూపొందించే ఛాన్స్‌ ఉంది. తన పర్యటనకు వస్తున్న ప్రజాదరణ చూసి జగన్‌ కూడా కుషీగా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమి ఆయన భావిస్తున్నట్టు సమాచారం. దీన్ని మరింత క్యాష్‌ చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది వైసీపీ. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అనుకుంటోంది.

వైసీపీకి చంద్రబాబు, పవన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ – ఇక దబిడి దిబిడే..!

వైఎస్‌ జగన్‌ ఉంగరం వెనుక అసలు కథ ఇదేనా..?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments