Homeఅంతర్జాతీయంట్రంప్ మొదలుపెట్టాడు, మేం క్లోజ్ చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

ట్రంప్ మొదలుపెట్టాడు, మేం క్లోజ్ చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!

Iran warns Donald Trump: తమ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. అమెరికా యుద్ధం మొదలు పెట్టిందని, తాము ముగిస్తామని ఇరాన్ తేల్చి చెప్పింది. “ అమెరికా అధ్యక్షుడు తమ మీద యుద్ధం ప్రారంభించారు, మేం అంతం చేస్తాం. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించింది. అమెరికా పెద్ద నేరం చేసింది. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదు. పశ్చామాసియాలో ఉన్న అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తాం” అని తేల్చి చెప్పింది.

రెండు వారాలని చెప్పి రెండు రోజుల్లోనే..

ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో సహకారంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన 2 రోజుల్లో అమెరికా ఇరాన్ మీద దాడులు చేసింది. భారీ స్థాయిలో ఉన్న బాంబులను అణు స్థావరాలపై వేసింది. ఇరాన్ గగనతలం బయటి నుంచే దాడులు చేసినట్లు యుఎస్ ప్రకటించింది. ఇజ్రాయెల్-అమెరికా చరిత్రలో ఇదో ముఖ్యమైన పరిణామం అని వెల్లడించింది. తమ దాడులతో ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. మరోవైను ఇరాన్ పై దాడులకు ప్రతిగా తాము రెడ్ సీలోని అమెరి నౌకలపై దాడులు చేస్తామని హూతీలు ట్రంప్ ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ అలర్ట్.. అమెరికా వార్నింగ్..

అటు ఇరాన్ పై  అమెరికా దాడులతో ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యింది. ఇరాన్ తమ మీద ప్రతిదాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశ వ్యాప్తం హై అలర్ట్ ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు అత్యవసర పనుల కోసం మాత్రమే బయటకు రావాలని ఆదేశించింది. మరోవైపు అమెరికాకు, తమ పౌరులను నష్టం కలిగించేలా ఇరాన్ ఎలాంటి చర్యలు తీసుకున్నా తీవ్రంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరించారు. తన మాటలను పట్టించుకోకపోతే, తాజాగా టెహ్రాన్ మీద చేసిన దాడులకు మించి దాడులు చేస్తామని హెచ్చరించారు.

Read Also: ఇరాన్ లో అమెరికా దాడులు, ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారంటే?

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments