Homeతెలంగాణరేపు, ఎల్లుండి వానలు.. ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?

రేపు, ఎల్లుండి వానలు.. ఏ జిల్లాల్లో కురుస్తాయంటే?

Telangana Rain Alert: తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుండగా, మరోవైపు వానలు పడుతున్నాయి. ఎండాకాలంలో వర్షాలు కురిసి, వానాకాలం ప్రారంభమైన అనుకున్న స్థాయిలో వానలు పడటం లేదు. వానాకాలం సాగు మొదలైనా వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు వానలు కురుస్తాయా? అని ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు   

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు పడుతాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురనున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు, సుమారు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు(జూన్ 20న) ఉమ్మడి వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, జిల్లాల్లో వర్షం పడనున్నట్లు వెల్లడించింది.  అటు జూన్ 21న ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వానలు పడుతాయని వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరికలు

ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వానలు పడే సమయంలో పొలాల దగ్గర ఉన్న వాళ్లు చెట్ల కింద ఉండకూడదన్నారు. వీలుంటే వర్షం పడే సమయంలో పొలం దగ్గరికి వెళ్లకపోవడం మంచిదని సూచించారు.

Read Also: ఇజ్రాయెల్ లో తెలంగాణ పౌరుడు మృతి, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments