Friday, March 20, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కొడాలి నాని అరెస్ట్, కోల్ కతా ఎయిర్ పోర్టులో పట్టుకున్న పోలీసులు?

కొడాలి నాని అరెస్ట్, కోల్ కతా ఎయిర్ పోర్టులో పట్టుకున్న పోలీసులు?

Kodali Nani Arrest: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. కోల్ కతా నుంచి కొలంబో వెళ్తుండగా ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో నమోదైన కేసులో కొడాలి నాని మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోల్ కతా ఎయిర్ పోర్టు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఏపీ పోలీసులు ఆయనను విజయవాడకు తీసుకురానున్నట్లు సమాచారం.

కోల్ కతా నుంచి విదేశాలకు పారిపోయే ప్రయత్నం!

కొడాలి నాని గత కొద్ది రోజులులగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చికిత్స కోసం జాయిన్ అయ్యారు. ఈ మధ్యే గుండె సంబంధ ఆపరేషన్ చేశారు. ఆయన ప్రస్తుతం ముంబైలో ఉన్నారని, త్వరలో ఏపీకి వస్తారని వైసీపీ నాయకులు చెప్పారు. కానీ, ఆయన కోల్ కతా నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

కొడాలి నానిపై పలు చోట్ల కేసులు

గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, ఆయన కొడుకు, ప్రస్తుత మంత్రి లోకేష్ మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేవారు. పలుమార్లు దూషణలకు దిగాడు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులన నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయినా, వైసీపీ సర్కారు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీకి చెందిన పలువురు నాయకులు ఆయనపై పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో నాని మీద కేసులు నమోదు అయ్యాయి. కొంత కాలంగా నాని ఏపీలో లేకపోవడంతో పోలీసులు ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏపీ పోలీసులు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కోల్ కతా ఎయిర్ పోర్టు నుంచి ఆయన కొలంబో వెళ్తుండగా ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: 80 వేల అప్పు.. మహిళను ఈడ్చుకెళ్లి.. చెట్టుకు కట్టేసి కొట్టిన కుప్పం టీడీపీ నేత

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments