Wednesday, March 18, 2026
Homeతెలంగాణఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఎందుకంటే?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఎందుకంటే?

MLC Kavitha Arrest: ఎమ్మెల్సీ కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కంచన్ బాగ్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలంటూ కవిత ఆందోళన చేపట్టారు. జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ దగ్గర భారీ నిరసనకు దిగారు. హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల నుంచి జాగృతి కార్యకర్తలు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న బస్ పాసు చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ, ఇతర బస్ పాసులు, టికెట్ చార్జీలను పెంచడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సామాన్యులు, ప్రైవేట్ ఉద్యోగల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం కవితతో పాటు జాగృతి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

బస్ పాస్ ధరలు భారీగా పెంచిన ప్రభుత్వం  

ఆర్టీసీ తాజాగా బస్ పాస్ లను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెంచిన ధరలను వెంటనే అమల్లోకి తీసుకొచ్చినట్లు సోమవారం నాడు ప్రకటన చేసింది. విద్యార్థుల బస్‌ పాస్‌ ఛార్జీలను గత మూడేళ్లుగా పెంచలేదన్నఆర్టీసీ.. పెరిగిన ఖర్చుల కారణంగా అన్ని రకాల పాసుల ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. సాధారణ ప్రజలతో పాటు స్టూడెంట్‌ పాస్‌ ధరలను పెంచింది. 20 శాతానికి పైగా బస్‌ పాస్‌ రేట్లను పెంచినట్లు వెల్లడించింది. రూ.1,150 ఉన్న ఆర్డినరీ పాస్‌ ధర రూ.1,400కు పెంచింది. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ పాస్‌ ధర రూ.1,600కు పెరిగింది. అటు రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్‌ పాస్‌ ధర రూ.1,800కు పెరిగింది. సాధారణ బస్ పాస్ లతో పాటు, స్టూడెంట్ బస్ పాస్ లను కూడా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Read Also: అమరావతి మహిళలపై సజ్జల తీవ్ర వ్యాఖ్యలు, నిప్పులు చెరిగిన షర్మిళ!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments