Homeతెలంగాణకాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా, మందుల సామేల్ వీడియో వైరల్!

కాంగ్రెస్ ఎమ్మెల్యే వసూళ్ల దందా, మందుల సామేల్ వీడియో వైరల్!

Congress MLA Mandula Samuel Viral Video: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వసూళ్ల దందాకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నిత్యం పార్టీ నాయకులతో విభేదాల కారణంగా హెడ్ లైన్స్ లో ఉండే సామేలు తాజా మరో వివాదంలో చిక్కుకున్నారు.  లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే సామేల్ వసూళ్లు అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. “గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో? లేదో? తెలియదు. నా డబ్బులు నేను రాబట్టుకోవాలి. ఎవ్వరు ఇవ్వకున్నా వాడిని విడిచి పెట్టేది లేదు” అంటూ ఈ వీడియోలో సామేల్ అనడం వినిపించింది. మద్యం దుకాణాల యజమానులతో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది.  ప్రస్తుతం ఈ వీడియో నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు లిక్కర్ మాఫియా ఆయనతో బేరాలు ఆడుతూ ఈ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ముందస్తు పథకం ప్రకారమే ఈ వీడియో షూట్ చేసినట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే పార్టీ నాయకులు,  సెకెండ్ గ్రేడ్ నాయకులతో నిత్యం ఏదో వివాదం నడుస్తుండగా ఇప్పుడు ఇదో తలనొప్పిగా తయారైంది.

నా వాయిస్ మిమిక్రీ చేశారు, మల్లన్నపై ఫిర్యాదు చేస్తా- సామేల్

అటు ఈ వీడియో వ్యవహారంపై మందుల సామేల్ రియాక్ట్ అయ్యారు. కొంత మంది దుర్మార్గులు తన ఇంట్లో తిని తనకే విషం పెట్టి చంపాలని చూస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైరల్ అవుతున్న వీడియోలో తన వాయిస్ మిమిక్రీ చేశారన్నారు. “వచ్చినవారు మద్యం వ్యాపారులే. అందులో వారి కష్టాలు నాకు.. నా కష్టాలను వారికి చెప్పుకున్నాము.  కానీ, నేను ఎవరిని డబ్బులు అడగలేదు. ఈ వ్యహారం వెనుక తీన్మార్ మల్లన్న ఉన్నాడు. నాకు పెరుగుతున్న ఆదరణను ఓర్చుకోలేక వైన్స్ ముడుపులతో పాటు మరో వీడియో ఉందంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సామాన్య జీవితాన్ని గడుపుతున్న నాపై బురద జల్లాలని కొందరు చూస్తున్నారు. మాదిగ జాతికి చెందిన ఒక ఎమ్మెల్యే పై ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మంచివి కావు. అధిష్టానానికి తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేస్తాను” అని సామేల్ చెప్పుకొచ్చారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మందుల సామెల్ తో బేరం ఆడుతూ సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు మద్యం వ్యాపారులు.

Read Also: బస్ పాస్ చార్జీల బాదుడు, ఏకంగా 20 శాతం పెంపు!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments