Tuesday, March 10, 2026
Homeతెలంగాణఇక మన దగ్గరే రాఫెల్ తయారీ, ఎరోస్పేస్ హబ్ గా హైదరాబాద్!

ఇక మన దగ్గరే రాఫెల్ తయారీ, ఎరోస్పేస్ హబ్ గా హైదరాబాద్!

టెక్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న హైదరాబాద్ ఇప్పుడు ఏరో స్పేస్ రంగంలోనూ దూకుడు పెంచుతోంది. దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీలో హబ్ గా మారాబోతోంది. డ్రోన్లు, క్షిపణులు, ఉపగ్రహాలు తయారు చేసి ఏరో స్పేస్ కంపెనీలు భాగ్యనగరంలో కొలువుదీరాయి. ఇప్పుడు ఏకంగా రాఫెల్ యుద్ధ విమానాలు కూడా రెడీ కాబోతున్నాయి.

రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ఇక్కడే!

రాఫెల్ యుద్ధ విమానాలు భారతీయ వాయు సేనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.  ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఈ ఫైటర్ జెట్లు తాజాగా ఆపరేషన్ సిందూర్ లో కీ రోల్ పోషించాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధ విమానాలను ఇప్పుడు హైదరాబాద్ లోనే తయారు చేయనున్నారు. ఈ విమానాలకు సంబంధించిన అత్యంత కీలక మైన ఫ్యూస్‌లాజ్‌ అంటే, విమానం ప్రధాన భాగం తయారు చేయనున్నారు. ఇప్పటికే డసో ఏవియేషన్‌ తో ఒప్పందం కుదుర్చుకున్న టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌.. ఆ తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లో ఈ ప్రతిష్టాత్మక కంపెనీ ఏర్పాటు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే పలు ఎరోస్పేస్ కంపెనీలు ఏర్పాటు

భారతీయ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే యుద్ధ విమానాలు తయారు చేసే పలు కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్ లో కొలువుదీరాయి. వెమ్‌ టెక్నాలజీస్‌ సంస్థ  తేజస్‌ ఎంకే1ఏ యుద్ధవిమానాల సెంట్రల్‌ ఫ్యూస్‌ లాజ్‌ ను ఇక్కడే అసెంబుల్‌ చేసి హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ కు అందజేస్తుంది. అటు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఫిఫ్త్ జెనరేషన్ యుద్ధ విమానం ఆమ్కా(అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌) డెవలప్ లో వెమ్‌ టెక్నాలజీస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విమానం  ఎండ్‌ టు ఎండ్‌ మాడ్యూల్స్‌ తయారీతో పాటు ఎయిర్‌ క్రాఫ్ట్‌ అసెంబ్లింగ్‌ లో భాగం అవుతోంది.  మొత్తంగా హైదరాబాద్ ఏరో స్పేస్ కంపెనీలకు హబ్ గా మారుతోంది.

Read Also: తప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిన నర్సు, ఏకంగా ఐదుగురు పేషెంట్లు మృతి!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments