కుక్కల భయం.. ఈ అమ్మాయి చేసిన పనికి షాకవ్వాల్సిందే!

0
188
Woman books Ola bike ride for 180 meters to dodge street dog video goes viral on social media
Woman books Ola bike ride for 180 meters to dodge street dog video goes viral on social media

Viral Video: ఈ రోజుల్లో పట్టణాల్లో వీధి కుక్కల బెడద బాగా పెరిగిపోయింది. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లోనూ కుక్కల సంఖ్య పెరగడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వారి సంగతి అటుంచి స్థానికులను కూడా కరుస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల సమస్య తట్టుకోలేక.. ఓ యువతి చేసిన పని చూసి అందరూ షాకయ్యారు. ఇంతకీ ఆమె ఏం చేసింది? అంత షాకవ్వాల్సిన విషయం ఏముంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కుక్కల నుంచి తప్పించుకునేందుకు క్రేజీ ఐడియా!

సదరు యువతి ఆఫీస్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా, దారిలో కుక్కల గుంపు కనిపించింది. ఒక్కసారిగా తను భయంతో వణికిపోయింది. ఏం చేయాలా? అని ఆలోచించింది. అప్పుడు తనకు బుర్రలో ఓ ఆలోచన తట్టింది. వెంటనే బైక్ బుక్ చేసింది. వెంటనే సదరు బైక్ డ్రైవర్ అక్కడికి చేరాడు. ఆమెను ఓటీపీ అడిగాడు. తను ఓటీపీ ఎంటర్ చేయగానే ఆమె వెళ్లాల్సిన ప్లేస్ అక్కడి నుంచి కేవలం 180 మీటర్లు ఉండటం చూసి షాకయ్యాడు. మీరు వెళ్లాల్సిన ప్లేస్ ను కరెక్ట్ గానే సెలెక్ట్ చేశారా? అని ప్రశ్నించాడు. అవును అని తను చెప్పింది. ఇంత తక్కువ దూరం వెళ్లడానికి బైక్ ఎందుకు బుక్ చేశావని అడిగాడు. అప్పుడు ఆమె చెప్పిన మాట విని షాకయ్యాడు.

ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే?

తాను వెళ్లే దారిలో కుక్కలు ఉన్నాయని, వాటిని చూడగానే భయమేసిందని చెప్పింది. ఒక్కసారిగా బైక్ డ్రైవర్ ఆశ్చర్యపోవడంతో పాటు నవ్వాడు. సరే అని చెప్పి, ఆమెను బైక్ ఎక్కించుకుని సేఫ్ గా తన ఇంటి దగ్గర దింపాడు. ఈ తతంగం అంతా రికార్డు చేశాడు. ఈ వీడియోను @rohitvlogster అనే యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  ఆమె ఆలోచనకు అందరూ మెచ్చుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం నవ్వుతున్నారు. నిజానికి వీధి కుక్కల వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయా మున్సిపాలిటీలు వెంటనే కుక్కలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి.. ఈ పుకారు వెనుక అసలు కథ ఏంటి?