Tuesday, March 10, 2026
Homeతెలంగాణకుమ్మరి వృత్తిని ఆదుకోవాలి: ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

కుమ్మరి వృత్తిని ఆదుకోవాలి: ఎమ్మెల్సీ నెలికంటి సత్యం

చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:-చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో కుమ్మరి వృత్తిదారులు చేస్తున్న కుండల పరిశ్రమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం బుధవారం సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుమ్మరులు మట్టి పరికరాలు తయారు చేసుకోవడానికి ప్రభుత్వ సహకారం అందించాలని కుమ్మరి మృతి దారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుండలు తయారు చేస్తున్న వృత్తిదారులకు 100 కోట్లు కేటాయించి ఆదుకోవాలని కోరారు. మట్టి పరికరాలు తయారు చేస్తున్న కుమ్మరి వృత్తికి స్థలాలు లేవని.. ప్రతి గ్రామానికి రెండు ఎకరాల భూమి కేటాయించడం ద్వారా కుండలు కాల్చుకోవడానికి, వాముల నిర్మించుకొని షెడ్లు వేసుకుని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. పాటరి ట్రైనింగ్ (కుమ్మరకళ శిక్షణ) సెంటర్లు పెట్టి గృహోపకరణాలు తయారు చేసుకోవడానికి శిక్షణ ఇచ్చి ఈ కుటీర పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించడం ద్వారా కుమ్మరి వృత్తిదారులు, యువకులు కూడా నేర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. చెరువులో ఉన్నటువంటి మట్టిని ప్రభుత్వమే అందించాలని అన్నారు. చెరువు నుండి మట్టి ని భేషరతుగా తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. వృత్తి పరికరాలు
అధునాతనమైనవి వచ్చినందున
సబ్సిడీతో పరికరాలు అందించాలని అన్నారు. అదేవిధంగా మట్టి పరికరాలు తయారు చేస్తున్న
కుమ్మరులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, రొండి నరసింహ, టంగుటూరి రాములు, ఎస్ ఏ రహమాన్, దాసరి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత

విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments