Homeతెలంగాణబ్రేకింగ్ న్యూస్!.. హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం!... రెండు బోట్లు దగ్ధం?

బ్రేకింగ్ న్యూస్!.. హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం!… రెండు బోట్లు దగ్ధం?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-తెలంగాణ రాష్ట్రంలోని హుస్సేన్ సాగర్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తాజాగా హుస్సేన్ సాగర్ లో మహాభారత ఫౌండేషన్ చేపట్టిన ‘ భారతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన బాణ సంచాలు పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ భాణ సంచా పేలడం కారణంగా ఏకంగా రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి . అయితే అదే సమయంలో బోట్లలో ఉన్న ప్రయాణికులు అందరూ కూడా సురక్షితంగా బయటకు చేరుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం బోట్లు దగ్ధం అయ్యే దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి
1.దడ పుట్టిస్తున్న సైబర్ దాడులు!..ప్రతి రోజు వేల సంఖ్యల్లో కేసులు?

2.శ్రీచైతన్య విద్యా సంస్థలకు షాక్.. సెంట్రల్ కిచెన్ లైసెన్స్ రద్దు

3.నేనే ఎక్కువసార్లు గెలిచా.. సీఎం పదవిపై ఉత్తమ్ సంచలనం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు