Tuesday, February 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్మురళీ మోహన్ జయభేరీకి షాక్.. జనం తిరగబడటంతో పరార్

మురళీ మోహన్ జయభేరీకి షాక్.. జనం తిరగబడటంతో పరార్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన జయభేరీ మురళీ మోహన్ కు ఊహించని షాక్ తగిలింది. గుంటూరులో టీడీపీ నేత మురళి మోహన్ జయభేరి నిర్మాణ సంస్థపై తిరగబడ్డారు ప్లాట్లు కొనుగోలు చేసిన జనం. జయభేరి నిర్మాణ సంస్థపై నిరసన తెలుపుతున్నారు జయభేరి క్యాపిటల్ అపార్ట్‌మెంట్ వాసులు.

గుంటూరు – తాడేపల్లి మండలం కుంచనపల్లి వద్ద జయభేరి నిర్మాణ సంస్థపై కార్లు అడ్డం పెట్టి నిరసనకు దిగారు జయభేరి క్యాపిటల్ అపార్ట్‌మెంట్ వాసులు.అన్ని వసతులు ఉన్నాయని జయభేరి నిర్మాణ సంస్థ చెబితే ప్లాట్లు కొనుగోలు చేశాం.. కానీ జయభేరి నిర్మాణ సంస్థ మమ్మల్ని మోసం చేసింద ని నిరసకారులు ఆరోపించారు. పార్కింగ్‌లో లైట్లు వెలగడం లేదు.. సీసీ కెమెరాలు లేవు.. చివరకు ఫైర్ సేఫ్టీ కూడా లేదని చెబుతున్నారు.

జయభేరి క్యాపిటల్ అపార్ట్‌మెంట్ లో అనేక సమస్యలు ఉన్నాయి.. నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్న జయభేరి నిర్మాణ సంస్థ, ఆరు నెలల నుంచి మెయిల్‌తో పాటు వివిధ రూపాల్లో కంప్లైంట్ చేసిన స్పందించట్లేదు అంటూ కార్లు అడ్డం పెట్టి ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడుతున్నారు. సమస్యపై జయభేరి ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments