జాతీయంతెలంగాణ

బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వకు గుండెపోటు?

సెప్టెంబర్ రెండో తారీఖున ఎంతో ఘనంగా బిగ్ బాస్ సీజన్ 8 అనేది ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇందులో ఓల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ అయిన గంగవ్వకు నిన్న రాత్రి గుండెపోటు వచ్చిందని సమాచారం అందింది. అయితే ఇది నిజంగానే వచ్చిందో లేక బిగ్ బాస్ పెట్టిన టాస్క్ అనేది ఇంకా తెలియలేదు. నిన్న రాత్రి బిగ్ బాస్ హౌస్ లోకి డాక్టర్లు వచ్చిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గంగవ్వ వయసులో పెద్దవారు. అందుకే ఈ సంవత్సరం వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కానీ సరిగ్గా టాస్కులలో పాల్గొనటం లేదు. అయితే నిన్న రాత్రి ఆమెకి గుండెపోటు వచ్చినట్లు అలాగే హుటాహుటి నా డాక్టర్స్ వచ్చి గంగవ్వ ని పరిశీలించారట. ఇక దాంతో తన వల్లే గుండెపోటు వచ్చిందేమో అనుకుని ఒకసారి ఇక విష్ణు ప్రియ భయపడిపోయిందట.

Read More : వరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున కారు…?

అయితే ఇది కచ్చితంగా ఫ్రాంక్ అని హోస్ట్ నాగార్జున కావాలనే ఈ టాస్క్ ను గంగవ్వతో ఆడించారని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సరే ఇలా చేయడం సరి కాదని ఇలా చేయడం వల్ల అటు గంగవ్వ ఫ్యామిలీతో పాటు ఇటు హౌస్ లోని కంటెస్టెంట్స్ కూడా ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉందని తద్వారా ఒక్కోసారి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

Back to top button