క్రైమ్ మిర్రర్, సినిమా:- నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే, అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అన్నదానిపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చిత్రానికి సంబంధించి ఇంకా ఒక పాట చిత్రీకరణ పూర్తికావాల్సి ఉంది. దీనితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అత్యంత కీలకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (రీ-రికార్డింగ్) పనులు కూడా ఇంకా పురోగతిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
మరోవైపు, ఎలాంటి ఆలస్యం లేకుండా చెప్పిన తేదీకే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. పెండింగ్ ఉన్న సాంగ్ షూట్ పూర్తి చేయడంతో పాటు రీ-రికార్డింగ్ పనులను వేగవంతం చేస్తూ ప్రొడక్షన్ పనులను పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. సమయం తక్కువగా ఉన్నప్పటికీ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఆన్‌టైమ్‌లో ‘ప్యారడైజ్’ ను అందించేందుకు చిత్ర బృందం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
