HomeతెలంగాణBandi Sanjay: రాజకీయంగా ఎదుర్కోలేక నాపై దుష్ర్ప‌చారం...బండి సంజ‌య్‌...!

Bandi Sanjay: రాజకీయంగా ఎదుర్కోలేక నాపై దుష్ర్ప‌చారం…బండి సంజ‌య్‌…!

  • ఫాం హౌజ్‌లో ఉండే ఎలుక‌ను కాదు….

  • అయ్య‌పేరుతో రాజ‌కీయాల్లోకి రాలేదు

  • క‌మ‌లం జెండా ప‌ట్టుకొని కింది స్థాయి నుంచి వ‌చ్చిన కార్య‌క‌ర్త‌ను

హైదరాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: బబీజేపీ పార్టీ, కార్య‌క‌ర్త‌లు త‌ల‌వంచుకునే ప‌ని తాను ఏనాడు చేయ‌న‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ అన్నారు. జై శ్రీరామ్‌, భారత్‌ మాతాకీ జై అంటూ పార్టీ తలెత్తుకునేలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు. ఆదివారం మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌రేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసి బీజేపీ భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. ‘‘నన్ను రాజకీయంగా ఎదుర్కొనడం చేతగాని మూర్ఖులు.. నాపై లేని ఆరోప‌ణ‌లు, దుష్ర్ప‌చారాలు చేస్తున్నారు. కాని నేను ఫాంహౌజ్‌లో ఉండే ఎలుక‌ను కాదు. నేను అయ్య‌, తాత‌పేరు చెప్పుకొని రాజ‌కీయాల్లోకి రాలేద‌ని పార్టీ జెండా ప‌ట్టుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని తెలిపారు. న‌రేంద్ర‌మోడీ శిశ్యునిగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పార్టీ కోసం ప‌ని చేస్తున్నాన‌ని తెలిపారు.

పార్టీకి త‌ల‌వంపులు తెచ్చే ప‌ని చేయ‌ను, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మకండి’’ అని బండి సంజయ్‌ అన్నారు. జై శ్రీరామ్‌ అంటే కడుపు నిండుతుందా అని, పైసలు పడతయా అని బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని, అయితే పశ్చిమ బెంగాల్‌, అసోంలో గెలుపుతో ఆ నినాదం వారిని భయపెడుతోందని తెలిపారు. జై శ్రీరామ్‌ నినాదమే గడీలను బద్దలు కొట్టి కేసీఆర్‌ను ఫాంహౌస్‌ కు పరిమితం చేసిందన్న విషయాన్ని ఆయన కుటుంబం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని హేళన చేస్తే ఊరుకునేది లేదని, 80 శాతం హిందువుల కోసం బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు.

అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తాం...

తాము ఒక‌వ‌ర్గానికి న్యాయం చేసి మ‌రొక వ‌ర్గానికి అన్యాయం చేయ‌మ‌ని తెలిపారు. మేము అల్లాను, ఏసు ప్ర‌భువును కించ‌ప‌రుచ‌లేదు, శ్రీ‌రాముడిని, భ‌గ‌వంతున్ని కించ‌ప‌రిస్తే ఊరుకునేది లేద‌ని హ్చ‌రించారు. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌, క‌మ్యూనిస్టులు ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. కాగా కేంద్రం ఇచ్చే నిధుల‌తో తెలంగాణ రాష్ర్టం న‌డుస్తుంద‌ని లేకుంటే చ‌క్రాలు లేని బండిలా త‌యారు అవుతుంద‌ని తెలిపారు. కేంద్రం వేల కోట్ల నిధుల‌ను తెలంగాణకు ఇస్తుంటే వాటిని కాంగ్రెస్ నాయ‌కులు మూట‌ల్లో క‌ట్టి ఢిల్లీకి పంపిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. రాష్ర్టంలో ఆరు గ్యారంటీలు అమ‌లుకు చేత‌కాక రాహుల్, ప్రియాంక ముఖం చూపించ‌లేక తెలంగాణ వైపు చూడ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు