HomeజాతీయంPM Modi: బంగారం కొనకండి, ఇంధన వినియోగం తగ్గించండి.. హైదరాబాద్ సభలో మోదీ కీలక సూచనలు!

PM Modi: బంగారం కొనకండి, ఇంధన వినియోగం తగ్గించండి.. హైదరాబాద్ సభలో మోదీ కీలక సూచనలు!

PM Modi’s Important Message: హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. దేశ ఆర్థిక పరిస్థితులు, ఇంధన వినియోగం, దిగుమతులపై ఆధారపడటం వంటి అంశాల నేపథ్యంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ప్రాధాన్యత ఇవ్వండి!

మోదీ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అవసరం లేని ప్రయాణాలు తగ్గితే ఇంధన వినియోగం కూడా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, సాధ్యమైనంత వరకు మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వాడాలని సూచించారు. సరుకు రవాణాలో కూడా రైళ్ల వినియోగం పెంచాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం దేశానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.

బంగారం కొనుగోళ్లు తగ్గించండి!

ఇక కుటుంబ ఖర్చుల విషయంలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని సూచించారు. కొంతకాలం బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ఆయన చెప్పినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అలాగే, వంటనూనెల వినియోగాన్ని కూడా తగ్గించాలని సూచించారు. ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిదేనని కొందరు భావిస్తున్నారు.

ఎరువుల వాడకం తగ్గించండి!

వ్యవసాయ రంగంపై కూడా మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని సూచించారు. దీంతో భూమి ఆరోగ్యం కాపాడబడటంతో పాటు, పంటల నాణ్యత కూడా మెరుగుపడుతుందన్నారు. విదేశీ కంపెనీల ఉత్పత్తుల కంటే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల వినియోగం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆయన వెల్లడించారు.

ప్రధాని చేసిన ఈ సూచనలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇవి ముందస్తు జాగ్రత్త చర్యలని భావిస్తుండగా, మరికొందరు దేశ పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. ఏదేమైనా, మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు