Homeవైరల్త్రిష రెమ్యునరేషన్ వింటే దిమ్మ తిరగాల్సిందే బాబు..!

త్రిష రెమ్యునరేషన్ వింటే దిమ్మ తిరగాల్సిందే బాబు..!

Crime Mirror, Cinema Updates: దక్షిణాది సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్‌గా తన హవా కొనసాగిస్తున్న త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చెన్నై భామ.. ఇప్పుడు తన రెమ్యునరేషన్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న త్రిష.. తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Also Read: Jio Yearly Plans: జియో యూజర్లకు శుభవార్త…!

హిట్‌తో పెరిగిన డిమాండ్

ఇటీవల విడుదలైన కరుప్పు సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో త్రిష మార్కెట్ మరింత పెరిగిందని చెబుతున్నారు. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో త్రిషకు వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టుల కోసం ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే?

గతంలో ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకునే త్రిష.. ఇప్పుడు ఏకంగా రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు పారితోషికం కోరుతున్నట్లు సమాచారం. ఇటీవల ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించగా ఈ మొత్తాన్ని చెప్పినట్లు టాక్ నడుస్తోంది. దీంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. అయితే ఆమెకు ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా కొందరు నిర్మాతలు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Also Read: భోజనం తర్వాత ఈ పని తప్పనిసరిగా చేయండి…!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో హీరోయిన్‌గా నటించిన త్రిష.. ఆ సినిమాకు రూ.6 కోట్లలోపే పారితోషికం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో రెమ్యునరేషన్ పెంచిందనే ప్రచారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం త్రిష చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉండటంతో ఆమె డిమాండ్ కూడా పెరిగినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లోనే

సినిమాలతో పాటు త్రిష వ్యక్తిగత జీవితం కూడా తరచూ వార్తల్లో నిలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్‌తో ఆమెకు సంబంధం ఉందంటూ గత కొంతకాలంగా పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం కూడా జరిగినా.. వాటిపై స్పష్టత లేదు. ప్రస్తుతం మాత్రం త్రిష పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టి తన కెరీర్‌ను మరింత బలపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: విషాదం…చెత్త ట్రాక్ట‌ర్ ఢికొని ఇద్ద‌రు ఆటో డ్రైవ‌ర్లు మృతి…! ఒక‌రికి గాయాలు

Also Read: ఈ సైకో సెన్సేషన్…!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు