Homeక్రైమ్టూరిస్టు బ‌స్సు బోల్తా...! న‌లుగురు మృతి

టూరిస్టు బ‌స్సు బోల్తా…! న‌లుగురు మృతి

నిజామాబాద్,క్రైమ్ మిర్ర‌ర్: టూరిస్టుల‌తో వెళ్తున్న బ‌స్సు బోల్తా ప‌డి న‌లుగురు టూరిస్టులు మృతి చెందిన ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో విషాదం నింపింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం స‌మీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ బస్సు అర్ధరాత్రి 2 గంటల సమయంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు.అక్క‌డిక్కడే మృతి చెందారు.

కాగా ప‌లువురు ప్ర‌యాణీకులు తీవ్రంగా గాయ‌పడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టూరిస్ట్ బస్సు వేగంగా ప్రయాణిస్తుండగా డ్రైవ‌ర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు ఒక్కసారిగా అదుపు త‌ప్పి బోల్తా పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ బస్సు హైదరాబాద్ నుంచి నాగ్‌పుర్ వెళ్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గాయపడిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, అత్యవసర సేవలకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.మృతుల‌ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాగా మృతుల కుటుంబాలో తీవ్ర విషాదం అలుముకుంది.వైద్యులు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు శ్రమించాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవ‌ర్‌ నిర్లక్ష్యం, ఇతర సాంకేతిక కారణాల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

తాజావార్తలు