హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. నిన్న ఉన్న ధర నేడు ఉండటం లేదు. నేటి ధర రేపు ఉండటం లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడింది. అయితే భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మంగళవారం ( మే 19) ఉదయం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది. నగరంలో కిలో వెండి ధర రూ. 3,00,100గా ఉంది. సోమవారంతో పోలిస్తే.. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,360 ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,340 ఉంది. కిలో వెండి ధర రూ. 2,90,100గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.1,43,190గా ఉంది. కిలో వెండి రూ. 2,90,100 ఉంది. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,60,900 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,490గా ఉంది