Homeతెలంగాణకొండా ఫ్యామిలీ ఒంటరి...!

కొండా ఫ్యామిలీ ఒంటరి…!

  • మంత్రి సురేఖ పై తిరుగుబాటు

  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర భేటీ

  • మంత్రివర్గం నుంచి తొలగించడంతోపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లను టార్గెట్ చేసుకొని కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. హైదరాబాదులోని సీఎల్పీ కార్యాలయంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు అత్యవసరంగా భేటీ అయ్యారు. కొండ సురేఖ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెడుతున్న కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలని.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ హై కమాండ్కు అధికారికంగా తీర్మానం పంపాలని నిర్ణయించారు.

సీఎంపై వ్యక్తిగత విమర్శలు…

Also Read:తెలంగాణ‌లో బీజేపీకి ఇదే మంచి తరుణం…!

పరకాల అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కి మద్దతుగా మాట్లాడారు. దీనిపై సుస్మిత పటేల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. కాంగ్రెస్ పార్టీలో ఇది కలవరం రేపింది. ఇవి వ్యవహారంలో మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీచేసింది. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ బహిరంగంగా ఖండించలేదు సరి కదా.. అది ఆమె వ్యక్తిగత మంది దాటవేయడంపై సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండి సొంత ప్రభుత్వం పైనే దాడి చేయించడానికి ఎంత మాత్రం సహించకూడదని కూడా వారు అభిప్రాయపడ్డారు.

ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం…

Also Read:అందరి టార్గెట్ హరీష్…!

మరోవైపు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, బిర్లా ఐలయ్య, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తదితరులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా కుటుంబం ఏ ఒక్క ఎమ్మెల్యేతో సఖ్యతగా మెలగడం లేదని.. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు అలవాటు పడి పార్టీకి నష్టం తెస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలోకి వెళ్లి అధికారం అనుభవించి.. పార్టీ అధికారంలోకి రాగానే సీనియర్లమని చెప్పుకుంటూ అనవసర రక్త చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ మంత్రివర్గంలో కొనసాగే హక్కు కొండా సురేఖకు లేదు అని తేల్చి చెప్పారు.

ఒక్కరి మద్దతు కూడా లే…

Also Read:2015 మైనర్ల అక్రమ రవాణా కేసులో కీలక తీర్పు.. నిందుతులకు కఠిన శిక్షలు: ఐదుగురికి జీవిత ఖైదు

మరోవైపు పరిస్థితి చూస్తుంటే కొండా దంపతులు ఒంటరి అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వారి వైఖరి తెలిసి ఎవరు వారికి మద్దతు పలికే పరిస్థితి లేదు. పైగా మంత్రిగా ఉంటూ ఇతర ఎమ్మెల్యేలతో అంతగా సఖ్యత లేదు. ఏకపక్ష వైఖరితో పాటు అధికారులపై పెత్తనం, ఇతర నియోజకవర్గాల్లో జోక్యం వంటివి వారిపై విమర్శలు ఉన్నాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా కొండా దంపతులకు మద్దతు తెలిపే పరిస్థితి లేదు. వాస్తవానికి టిఆర్ఎస్ లో ఉండి ఆ పార్టీ మంత్రులుగా పని చేశారు. రేవంత్ పిలుపుతో కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రితో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అయితే రాజకీయ పెత్తనం కోసం ఎంతవరకు అయినా వెళ్లే పరిస్థితి కొండా దంపతులది. కాంగ్రెస్లో తిరిగి చేరేటప్పుడు కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారు. ఆపై పరకాల నియోజకవర్గ బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ రెండు దక్కకు పోయేసరికి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కొండా దంపతులకు మద్దతు తెలిపే అవకాశం లేదు. ఒక విధంగా వారు ఒంటరి అయినట్టే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు