క్రైమ్ మిర్రర్ : జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఓ విద్యార్థి తండ్రిపై దాడి చేసిన కేసులో అరెస్టయిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. గతంలో మూడు వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. ఆ సమయంలో నిందితుడి ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుని తాజాగా రెగ్యులర్ బెయిల్‌కు అనుమతించింది. సెప్టెంబర్ 15న భరద్వాజ్‌కు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ సమయంలో విధించిన షరతులను నిందితుడు పాటించిన తీరును పరిశీలించిన అనంతరం రెగ్యులర్ బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో న్యాయస్థానం స్పష్టం చేసింది. తాజాగా ఆయన ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
కేసుపై సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దు
బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు పలు షరతులు విధించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ వేదికల్లో పోస్టు చేయడం, ప్రచురించడం, చర్చించడం చేయకూడదని ఆదేశించింది. దర్యాప్తు, న్యాయ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది.
సెప్టెంబర్‌లో అరెస్ట్
బులంద్‌షెహర్‌లో సెప్టెంబర్ 4న భరద్వాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ కార్యకర్త తండ్రిపై దాడి చేసిన కేసులో ఆయనను అరెస్ట్ చేయాలని సీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 23న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ కార్యకర్త తండ్రిపై దాడి చేసినట్లు భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఆయనపై కేసు నమోదైనప్పటికీ కొంతకాలం అరెస్టు కాలేదు.
తిహార్ జైలుకు తరలింపు
సెప్టెంబర్ 7న భరద్వాజ్‌ను న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో ఆయనను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం కోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్ నేపథ్యంలో సెప్టెంబర్ 18న జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా తాత్కాలిక బెయిల్ సమయంలో ఆయన ప్రవర్తనను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
also read : మాధవన్ కొత్త అవతారం.. అంతర్జాతీయ బిజినెస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా!
