HomeUncategorizedత‌ల్లి చెక్కిన అప‌ర‌జ్ఞాని మౌర్య‌...! మూడు సార్లు ప్ర‌పంచ‌ రికార్డు...

త‌ల్లి చెక్కిన అప‌ర‌జ్ఞాని మౌర్య‌…! మూడు సార్లు ప్ర‌పంచ‌ రికార్డు…

  • ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డు…

  • ఐదు సెంట్ల భూమి

నల్లజర్ల (తూర్పుగోదావరి), క్రైమ్ మిర్ర‌ర్: పలక కూడా పట్టని వయసులోనే రెండున్నరేళ్ల బాలుడు మౌర్య అపారమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వరల్డ్ రికార్డ్స్ సృష్టిస్తున్నాడు. నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం కు చెందిన వీరబత్తిన మౌర్య రెండున్నరేళ్ల వయసులోనే మూడు సార్లు వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాడంటే ఒక్కసారి ఆ చిన్నోడి ప్రతిభ ఏంటో అర్థమవుతుంది. ఆవపాడు సచివాలయ ఏ.ఎన్.ఎం గా పనిచేస్తున్న రాణి తన కొడుకును అందరిలా కాకుండా విభిన్నంగా పెంచాలని విన్నూత్నంగా ఆలోచించింది. అదే చిన్నోడు మౌర్యను వరల్డ్ రికార్డ్స్ లో దూసుకెళ్లేలా చేసింది.

కేవలం 50 సెకన్ల సమయంలోనే విశాల భారతదేశ మ్యాప్ లో వున్నా 24 రాష్ట్రాలను గుర్తించినందుకు మౌర్య కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. ఇదే కాకుండా గతంలో కేవలం ఐదో నెల చిరుప్రాయంలో అదికూడా అన్న ప్రాసన కాకముందే జంతువుల బొమ్మలను, పక్షులను, పండ్లు, పువ్వులను, జాతినేతలను, జాతీయ పతాకాలను… ఇలా ఒకటేమిటి దాదాపు వందల్లో బొమ్మల కార్డులను అతికొద్ది సమయంలో గుర్తించి నోబుల్ వరల్డ్ రికార్డ్ ను మౌర్య అందుకున్నాడు.

ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రపంచ రికార్డ్ అందుకున్న మౌర్య…!

చిన్నతనంలోనే అద్భుత ప్రతిభను కనబర్చి రికార్డ్ సాధించిన మౌర్య తనకు వచ్చిన నోబుల్ ప్రపంచ రికార్డ్ ను గురువారం గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు చేతుల మీదుగా అందుకున్నాడు. చిన్నారి మౌర్య లో దాగివున్న ప్రతిభను గుర్తించి అందుకు తగ్గట్టు తయారు చేసిన తల్లి రాణీని ఎమ్మెల్యే మద్దిపాటి ప్రత్యేకించి అభినందించారు. చిన్నారి మౌర్యను మనసారా హత్తుకుని మరెన్నో ఘనవిజయాలు సాధించాలని ఎమ్మెల్యే తమ దివ్య ఆశీస్సులు అందించారు.

మౌర్య తల్లి రాణీకి అభినందనలతో పాటు ఐదు సెంట్లు స్థలం…!

అతి చిన్న వయసులోనే అపరజ్ఞానిగా ప్రపంచరికార్డ్ లను సాధిస్తున్న మౌర్య ను తయారుచేసిన తల్లి రాణీకి ప్రభుత్వం తరపున ఐదు సెంట్లు స్థలాన్ని ఇస్తున్నట్టు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రకటించారు. పిల్లల జ్ఞానాన్ని పసిగట్టి అందుకు అనుగుణంగా వారిని ఉన్నత స్థాయిలో ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో తల్లిగా రాణీ చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. తన కుమారుడు మౌర్య సాధిస్తున్న ఘనతను గుర్తించి గౌరవించిన ఎమ్మెల్యే కు రాణీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జీ.వీ.వీ.ప్రసాద్, సమాజసేవకులు మల్లిపూడి రాజారావు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు